హీరో విశాల్ కొత్త పార్టీ..!

తెలుగు వాడే అయినా తమిళంలో హీరోగా సెటిల్ అయిన విశాల్ ఈమధ్య అక్కడ జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించగా నామినేషన్ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యింది. అప్పుడే పొలిటికల్ గా ఎదగాలన్న బీజం పడినట్టు ఉంది అందుకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సొంత పార్టీ పెట్టేశాడు విశాల్. నిన్న తన పుట్టినరోజు సందర్భంగా మక్కల్ నల ఇయక్కమ్ పార్టీని ఎనౌన్స్ చేశాడు విశాల్.     


తమిళంలో ఇప్పటికే కమల్, రజినికాంత్ సొంత పార్టీలతో రెడీ అవుతున్నారు. 2019లో ఎన్నికల బరిలో దిగేందుకు వారు కార్యచరణలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో సడెన్ గా పార్టీ ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు విశాల్. ఇక తన ఫోటోతో ఉన్న జెండాను ఆవిష్కరించాడు విశాల్. తన ఫోటోతో పాటుగా అని సెర్వం (అంతా ఒక్క తాటిపై నడుద్దాం).. అన్ బై విత్తైపోం (ప్రేమ విత్తనాలు నాటుదాం)అంటూ స్లోగన్స్ పెట్టుకున్నాడు. ఇక జెండాకు ఓ పక్క అబ్దుల్ కలాం ఫోటో ఉండగా మరో పక్క మదర్ థెరిసా బొమ్మ ఉంది.       

అయితే ఇది అన్ని రాజకీయ పార్టీలల కాకుండా ఓ స్వచ్చంద సంస్థగా పనిచేస్తుందని అంటున్నాడు విశాల్. మరి 2019 లో ఇదే పార్టీతో రంగంలో దిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఏపిలోనే కాదు తమిళనాడులో కూడా 2019 ఎన్నికలు హాట్ హాట్ గా ఉంటాయని మాత్రం చెప్పొచ్చు.