
దివంగత నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా యాత్ర. ముఖ్యంగా ఆయన పాదయాత్ర నేపథ్యంతో ఈ సినిమా వస్తుంది. అందుకే సినిమా టైటిల్ గా యాత్ర అని పెట్టారు. పాదయాత్రతో ప్రజల మనసులను గెలుచుకున్న వైఎస్సార్ ఆ తర్వాత పదివిలోకి వచ్చారు. ఇక ఈ సినిమా నుండి మొదటి పాట రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 2 వైఎస్సార్ వర్ధంతి రోజు ఉదయం 7 గంటలకు సమర శంఖం అనే లిరికల్ సాంగ్ వీడియోతో సహా రిలీజ్ చేయనున్నారట చిత్రయూనిట్.
వైఎస్సార్ గా మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్న ఈ సినిమా 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. కళాశాల, ఆనందో బ్రహ్మ సినిమాల ద్వారా దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న మహి వి రాఘవ యాత్రను డైరెక్ట్ చేస్తున్నారు. 2019 లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నారు. ఈమద్యనే రిలీజ్ అయిన యాత్ర టీజర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది.