పరశురాంకు అడ్వాన్స్ గా ఫ్లాట్ ఇచ్చారట..!

ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న గీతా గోవిందం సక్సెస్ హంగామా ఎంత అన్నది ఆ సినిమా వసూళు చేస్తున్న కలక్షన్స్ చూస్తే తెలుస్తుంది. విజయ్ ను స్టార్ గా ప్రమోట్ చేస్తూ గీతా గోవిందం సరికొత్త సంచలనాలు సృష్టించింది. ఇక ఈ సినిమా దర్శకుడు పరశురాం కు ఈ సినిమా తన గీత మార్చేసిందని ఆయన చెప్పడమే కాదు వస్తున్న ఆఫర్లు చూస్తే మనకే తెలుస్తుంది.

గీతా గోవిందం తర్వాత కూడా బన్ని వాసు నిర్మాతగానే సినిమా ఉంటుందని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ లో వరుసగా 3వ సినిమా అంటే మాములు విషయం కాదు. ఇక ఈ సినిమా నిర్మాత బన్ని వాసు తర్వాత సినిమా కోసం ఓ ఇంటి ఫ్లాట్ ను అడ్వాన్స్ గా ఇచ్చేశాడట. హైదరాబాద్ లాంటి సిటీలో ఓ ఫ్లాట్ ఎంత కాస్ట్ లో వస్తుందో ఊహించుకోవచ్చు. ఆ రకంగా అడ్వాన్స్ భారీగానే అందుకున్న పరశురాం సినిమాకు రెమ్యునరేషన్ గా ఎంత తీసుకుంటాడో చూడాలి.