మహర్షి పేరెంట్స్ వాళ్లే

సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా రాబోతున్న మహర్షి సినిమాపై రోజుకో సర్ ప్రైజ్ న్యూస్ బయటకు వస్తుంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నాడని తెలిసిందే. పూజా హెగ్దె ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ మదర్ రోల్ లో జయప్రద నటిస్తున్నట్టు ఈమధ్య వార్తలు వచ్చాయి. 


సీనియర్ హీరోయిన్ అయిన జయప్రద సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఒకవేళ మహేష్ సినిమాతో మళ్లీ ఆమె రీ ఎంట్రీ ఇస్తుందని ఆశించారు. కాని మహేష్ తో ఆమె చేయట్లేదని తెలుస్తుంది. మహేష్ తల్లిదండ్రులుగా హిట్ పెయిర్ అయిన ప్రకాశ్ రాజ్, జయసుధ నటిస్తున్నారట. ఆల్రెడీ చాలా సినిమాల్లో వీరు మహేష్ కు పేరెంట్స్ గా నటించారు. వంశీ పైడిపల్లి ప్రతి సినిమాలో ప్రకాశ్ రాజ్, జయసుధ ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఆ హిట్ సెంటిమెంట్ తో మహేష్ మహర్షిలో కూడా జయసుధ ప్రకాశ్ రాజ్ లను ఎంచుకున్నారు. 2019 ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న మహర్షి సినిమాలో మహేష్ పూర్తిస్థాయి మేకోవర్ తో కనిపించనున్నాడు.