ఎన్టీఆర్ నీకు మేమంతా ఉన్నాం..!

ఈరోజు తెల్లవారుజామున సిని హీరో, మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నల్గొండ కేంద్రంలోని అన్నెపర్తిలో ఓవర్ స్పీడ్ గా వెళ్తున్న హరికృష్ణ ఓవర్ టేక్ చేయబోయి కారు డివైడర్ ను గుద్దడంతో పల్టీలు కొట్టి మరి రోడ్డుపక్కనకు వెళ్లింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ తలకు తీవ్ర గాయాలవడంలో నార్కెట్ పల్లి కామినేని హాస్పిటల్ కు తీసుకెళ్లారు.   


అయితే అక్కడకు వెళ్లిన కొద్దిసేపటికే డాక్టర్స్ హరికృష్ణ మరణించారని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం కామినేనికి వచ్చారు. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, సిని హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా కామినేని హాస్పిటల్ కు వచ్చారు. జగపతి బాబు కూడా కామినేని హాస్పిటల్ కు వచ్చి హరికృష్ణ పార్ధివ దేహాన్ని చూసి వెళ్లారు.   

ఇక టాలీవుడ్ స్టార్స్, దర్శకులు, నిర్మాతలు అంతా హరికృష్ణ మరణంతో షాక్ అయ్యారు. వారంతా ఎన్.టి.ఆర్ ఫ్యామిలీకి తమ సానుభూతి తెలిపారు. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ నీకు మేమున్నాం అంటూ తోటి స్టార్స్ ట్వీట్స్ చేశారు.