సూర్యకు విలన్ అవుతున్న కలక్షన్ కింగ్..!

80వ దశకంలో విలన్ గా చేసిన్ హీరోగా మారి కలక్షన్ కింగ్ గా మారాడు మంచు మోహన్ బాబు. హీరోగా ఆయన సినిమాలు ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే. తనయులిద్దరు హీరోలుగా కెరియర్ కొనసాగిస్తుంటే అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్నారు మోహన్ బాబు. అప్పుడప్పుడు ప్రతినాయకుడిగా కూడా చేస్తున్న మోహన్ బాబు లేటెస్ట్ గా కోలీవుడ్ హీరో సూర్యకు విలన్ గా మారుతున్నాడని తెలుస్తుంది.

కోలీవుడ్ హీరో సూర్య తెలుగు తమిళ భాషల్లో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు. సుధ కొంగర డైరక్షన్ లో సూర్య బైలింగ్వల్ దాదాపు కన్ఫాం అయినట్టే అని తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ గా మోహన్ బాబుని అనుకుంటున్నారట. సినిమా గురించి ఇంకా అఫిషియల్ ఎనౌన్స్ మెంటే రాలేదు ఈలోపే సినిమాపై రూమర్స్ వచ్చేస్తున్నాయి. మరి ఈ వయసులో మోహన్ బాబు ఈ రిస్క్ చేస్తారా లేదా అన్నది చూడాలి.