
కింగ్ నాగార్జున ఊపిరి తర్వాత చేస్తున్న మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగ్ తో పాటుగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు నాచురల్ స్టార్ నాని. అశ్వనిదత్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజ్ అయ్యి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా నుండి మొదటి పాట రేపు అనగా ఆగష్టు 29 నాగార్జున బర్త్ డే కానుకగా రిలీజ్ చేస్తున్నారు.
ఇక బర్త్ డే కానుకగా ఈరోజు సినిమాలోని నాగార్జున స్టిల్స్ రిలీజ్ చేశారు. సినిమాలో దేవాగా నాగార్జున డాన్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ఈరోజు రిలీజ్ చేసిన నాగార్జున లుక్ మాత్రం రాయల్ గా ఉంది. డాన్ అంటే ఎలా ఉంటాడో అనుకుంటే నాగార్జున మాత్రం స్టైలిష్ డాన్ గా అదరగొట్టనున్నాడని చెప్పొచ్చు. సెప్టెంబర్ 27న రిలీజ్ అవబోతున్న ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్, రష్మిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు.