
పరశురాం డైరక్షన్ లో విజయ్ దేవరకొండ, రష్మిక లీడ్ రోల్స్ చేసిన గీతా గోవిందం కలక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకెళ్తుంది. 50 కోట్లే ఎక్కువ అనుకుంటుంటే ఈ సినిమా ఏకంగా 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి సిని పండితులను సైతం షాక్ అయ్యేలా చేస్తుంది. గీతా గోవిందంతో విజయ్ దేవరకొండ మరో మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమా తన సినిమాకు కాపీ అంటున్నాడు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. ఆయన తీసిన పెళ్లిసందడికి ఈ సినిమా పోలిక పెట్టేశాడు. ఆ సినిమాకు ఈ సినిమాకు కథలో ఏమాత్రం పొంతన లేదు మరి ఎందుకు రాఘవేంద్ర రావు అలా అన్నరు అంటే ఆ సినిమా కలక్షన్స్ తో పాటుగా ఈ సినిమా కలక్షన్స్ పోల్చి చెప్పాడన్నమాట.
అదీగాక ఆ సినిమా నిర్మాత కూడా అల్లు అరవిందే. శ్రీకాంత్, రవళి, దీప్తి పట్నాకర్ నటించిన పెళ్లిసందడి సినిమా కోటి లోపే బడ్జెట్ తో తెరకెక్కగా 10 కోట్ల పైగా వసూళ్లను రాబట్టి బంపర్ హిట్ కొట్టిందట. ఆ సినిమా కలక్షన్స్ లానే ఇప్పుడు గీతా గోవిందం కూడా 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చి 100 కోట్లు మార్క్ క్రాస్ చేసింది. ఈ రెండు సినిమాల విషయంలో పోలిక కాస్త విచిత్రంగా ఉన్నా గీతా గోవిందం రాఘవేంద్ర రావుని మెప్పించిందని మాత్రం చెప్పొచ్చు.