చర్చల్లో సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్..!

బయోపిక్ సినిమాల హవా కొనసాగుతున్న తెలుగు చిత్ర పరిశ్రమలో మరో క్రేజీ బయోపిక్ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తుంది. అది ఎవరిదో కాదు నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణదే అని అంటున్నారు. తెలుగు పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ మార్క్ ఏంటో అందరికి తెలిసిందే. ప్రయోగాలకు పెద్ద పీట వేసే కృష్ణ మిగతా హీరోలెవ్వరు చేయని సాహసాలను సైతం అలవోకగా చేశారు.

ఇప్పటికి ఆయన అంటే గుర్తొచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. మన్యం పులి అల్లూరిగా కనిపించినా.. మొదటి స్పై థ్రిల్లర్ గూఢచారి చేసినా.. ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా ఒక జానర్ అని కాకుండా అన్నిటిని చేశారు. ఇక ఆయన బయోపిక్ ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చెప్పనవసరం లేదు.

కృష్ణ చిన్నల్లుడు సుధీర్ బాబు కృష్ణ బయోపిక్ చేయాలని అంటున్నారు. అయితే లీడ్ రోల్ లో మహేష్ నటిస్తాడా లేక సుధీర్ బాబు చేస్తాడా అన్నది చూడాలి. మహానటి సినిమా తర్వాత సెట్స్ మీద ఎన్.టి.ఆర్, యాత్రలతో పాటుగా జగపతి బయోపిక్ సముద్రం కూడా వస్తున్నాయి. మరి సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు.