
సురేష్ కొండేటి ఆధ్వర్యంలో సంతోషం సిని అవార్డ్స్ ప్రతి యేటా జరుగుతుంటాయి. సంతోషం సిని వార పత్రిక మొదలు పెట్టిన నాటి నుండి ఇప్పటివరకు దశ్బాధం పైగా సిని అవార్డులు ఇస్తున్నారు. ఆ క్రమంలో 2017 సంవత్సరం కు గాను మెగాస్టార్ చిరంజీవికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందించారు. ఖైది నంబర్ 150 సినిమాకు ఈ అవార్డ్ ఇవ్వడం జరిగింది.
ఈ అవార్డ్ తీసుకునేందుకు చిరంజీవి ఇష్టపడలేదట. అయితే సింగర్ జానకి చేతుల మీదుగా అవార్డ్ అందుకోవడం అదృష్టంగా భావిస్తూ ఫైనల్ గా చిరు అవార్డ్ అందుకున్నారు. ఈ కార్యమంలో భాగంగా జానకికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ అందించారు. ఈవెంట్ లో తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సినిమా అవార్డులు చాలా ఎక్కువవడం వల్ల సంతోషం అవార్డుల మీద సెలబ్రిటీస్ అంత దృష్టి పెట్టడం లేదు. కార్యక్రమంలో చిరంజీవి, జానకి గారు తప్ప ఎక్కువమంది సెలబ్రిటీస్ కనిపించలేదు.