రవితేజ ఫస్ట్ లుక్ వచ్చింది..!

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా శ్రీను వైట్ల డైరక్షన్ లో వస్తున్న సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ. మైత్రి మూవీస్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ గా పేకముక్కలను రిలీజ్ చేశాడు దర్శకుడు శ్రీను వైట్ల. నాలుగు పేక ముక్కలలో మూడిట్లో అమర్ అక్బర్ ఆంటోనీ ఉండగా నాలుగో పేకముక్కలో ఈ ముగ్గురు షాడో కనిపిస్తుంది. 

వెంకీ, దుబాయ్ శీనుల తర్వాత శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ మీద అంచనాలు పెరిగాయి. ఖచ్చితంగా ఈసారి ఆ రెండు సినిమాల కన్నా మించేలా కామెడీ పండిస్తారని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈమధ్య వరుస సక్సెస్ లను అందుకుంటుంది కాబట్టి ఈ సినిమా కూడా వారి సక్సెస్ మేనియా కొనసాగించేలా ఉంటుందని చెబుతున్నారు.