
బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ సినిమాపై కేవలం ఎనౌన్స్ మెంటే ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ను ఉత్సాహపరచింది. ఇక అక్టోబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పగా.. పరిస్థితి చూస్తుంటే అక్టోబర్ నుండి డిసెంబర్ అవసరమైతే వచ్చే ఏడాదికి ఈ సినిమా పోస్ట్ పోన్ చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం చరణ్ బోయపాటి సినిమాతో బిజీగా ఉండగా.. ఎన్.టి.ఆర్ అరవిందం సమేత పూర్తి చేసే పనుల్లో ఉన్నాడు. ఈ ఇద్దరు ఇంతవరకు స్క్రిప్ట్ వినలేదు. తను చేస్తున్న హీరో, హీరోయిన్స్ మధ్య స్క్రిప్ట్ డిస్కస్ చేయడం రాజమౌళికి అలవాటు. అందుకే చరణ్, ఎన్.టి.ఆర్ ఫ్రీ చేసుకుని స్క్రిప్ట్ విని ఫైనల్ చేశాకే సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. అది జరగాలంటే ఇప్పుడు వారిద్దరు బిజీగా ఉన్నారు. అందుకే దాదాపుగా మెగా నందమూరి మల్టీస్టారర్ నెక్స్ట్ ఇయరే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక సినిమా రిలీజ్ 2020 అంటున్నా 2021కి అది వచ్చే అవకాశం ఉంది.