రాజశేఖర్ సరసన అంజలి..!

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా మోషన్ పోస్టర్ ఇప్పటికే సినిమా మీద అంచనాలను పంచేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం దర్శక నిర్మాతల తిప్పలు అంతా ఇంతా కాదు మొదట రాజశేఖర్ పక్కన కాజల్ నే అనుకోగా ఆమె ఈ సీనియర్ హీరో పక్కన చేయనని చెప్పేసరికి వెనక్కి తగ్గారు.

ఇక ఫైనల్ గా అంజలి ఈ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ కు జోడి కట్టిన అంజలి బాలకృష్ణకు హీరోయిన్ గా నటించింది. ఆ లెక్క ప్రకారంగా చూస్తే రాజశేఖర్ పక్కన అంజలి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. 1980లో జరిగే క్రైం థ్రిల్లర్ కథగా ఈ సినిమా వస్తుంది. అ!తో తన టాలెంట్ చూపించిన ప్రశాంత్ వర్మ క్వీన్ రీమేక్ గా దటీజ్ మహాలక్ష్మి సినిమా చేస్తుండగా ఆ సినిమా షూటింగ్ పూర్తవడంతో కల్కి సెట్స్ మీదకు తెస్తున్నారు.