
ఈమధ్యనే రిలీజ్ అయిన గీతా గోవిందం సినిమా వసూళ్ల హంగామా తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో పరశురాం డైరెక్ట్ చేశాడు. రిలీజ్ అయిన నాటి నుండి ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వరుస హిట్లు కొడుతున్న పరశురాం ఈ సినిమాతో క్రేజీ దర్శకుడిగా మారాడని చెప్పొచ్చు.
అయితే గీతా గోవిందం సినిమా అల్లు అరవింద్ తన చిన్న కొడుకు అల్లు శిరీష్ తో చేయమన్నాడట. అందుకు పరశురాం ఒప్పుకోలేదట. ఆల్రెడీ ఈ సినిమాకు ముందు శ్రీరస్తు శుభమస్తు సినిమా అల్లు శిరీష్ తోనే చేశాడు పరశురాం. ఆ సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది. ఒకవేళ అరవింద్ కోరినట్టు గీతా గోవిందం అల్లు శిరీష్ తో చేస్తే మాత్రం కలక్షన్స్ ఈ రేంజ్ లో వచ్చేవి కాదు.