ఎన్టీఆర్.. ది కంప్లీట్ ఫ్యామిలీమెన్

స్టార్ హీరో అంటే వారికి ఉండే రెస్పాన్సిబిలిటీ అంతా ఇంతా కాదు. హిట్ కొడుతుంటే నెక్స్ట్ సినిమా ఆ అంచనాలను మించి ఉండేలా జాగ్రత్త పడటమే కాకుండా అభిమానులు కోరుకునేలా తమ సినిమాల ఎంపిక ఉండేలా చూసుకోవాలి. స్టార్ గా వారెంత బిజీగా ఉన్న వారికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. అందరిలాగే వారికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. హీరోల షెడ్యూల్స్ ను బట్టి తమ ఫ్యామిలీస్ కు టైం కేటాయిస్తుంటారు.       

టాలీవుడ్ లో స్టార్డం తో పాటుగా ఫ్యామిలీకి ఓకేరకమైన ప్రధాన్యత ఇస్తున్నాడు మహేష్. సినిమాలతో ఎంత బిజీగా ఉంటాడో ఫ్యామిలీతో అంతే చక్కగా టైం కేటాయిస్తాడు. ఇక ఇప్పుడు మహేష్ దారిలోనే ఎన్టీఆర్ కూడా వెళ్తున్నాడు. రెండో వారసుడు ఈమధ్యనే ఎన్టీఆర్ ఇంట అడుగుపెట్టాడు. వర్క్, ఫ్యామిలీ రెండిటిని హ్యాండిల్ చేయడం కష్టమే కాని దొరికిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. 

అలానే ఈ సండే తారక్ కాస్త ఫ్రీగా ఉన్నాడనుకుంట అందుకే తన పెద్ద కొడుకుతో కాసేపు ఆటలాడాడు. ముఖ్యంగా కొడుకు చేత దెబ్బలు తింటూ ఎన్.టి.ఆర్ భలే అనిపిస్తున్నాడు. మీరెప్పుడైనా మీ కొడుక్కి పంచింగ్ బ్యాగ్ అయితే అంటూ హ్యాష్ ట్యాగ్ కరాటే కిడ్ అని కామెంట్ చేస్తూ ఇన్ స్టాగ్రాంలో ఓ వీడియో పెట్టాడు ఎన్టీఆర్. ఈ వీడియోతో ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఎన్.టి.ఆర్ ది కంప్లీట్ ఫ్యామిలీమెన్ అని వీడియో వైరల్ చేస్తున్నారు.