రాజశేఖర్ 'కల్కి' మోషన్ పొస్టర్..!

అ! సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ చేస్తున్న సినిమా కల్కి. ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. 1980ల కాలం నాటి నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా కొత్తగా ఉంటుందని ఈ టైటిల్ పోస్టర్ చూస్తూనే తెలుస్తుంది. వివిధ రకాల ఆయుధాలతో కల్కి టైటిల్ డిజైన్ చేశారు. 

టైటిల్ లో కాన్సెప్ట్ చెబుతున్నట్టు ఉన్నా అది ఏంటన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. అ! తర్వాత క్వీన్ రీమేక్ గా దటీజ్ మహాలక్ష్మి సినిమా చేస్తున్న ప్రశాంత్ వర్మ ఆ సినిమా పూర్తి చేసి రాజశేఖర్ తో కల్కి మొదలు పెట్టాడు. లాస్ట్ ఇయర్ పిఎస్వి గరుడవేగతో మళ్లీ ఫాంలోకి వచ్చిన రాజశేఖర్ కల్కితో మరింత క్రేజ్ సంపాదించడం గ్యారెటీ అంటున్నారు. కథ, కథనాలు కొత్తగా ఉండటమే కాదు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించడం ఖాయమని చిత్రయూనిట్ చెబుతుంది. మరి సినిమా వస్తేనే కాని అసలు విషయం తెలియదు.