2 మిలియన్ కలక్షన్స్ తో గీతా గోవిందం..!

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఇలా మూడు వరుస హిట్లతో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ స్టార్ మెటీరియల్ అని మిగతా స్టార్స్ కూడా గుర్తించేశారు. యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ తన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ గీతా గోవిందంతో ఇంకా రికార్డులు కొడుతూనే ఉన్నాడు. ఆగష్టు 15న రిలీజ్ అయిన గీతా గోవిందం సినిమా ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ అందుకుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విజయ్ కన్నా ముందే స్టార్ అనిపించుకున్న నాచురల్ స్టార్ నానికి కూడా సాధ్యపడని ఈ ఫీట్ విజయ్ అందుకున్నాడు. అంతేకాదు తాను హీరోగా చేసిన 3 సినిమాలు మిలియన్ క్లబ్ లో చేరడం విశేషం. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో వచ్చిన గీతా గోవిందం సినిమాను బన్ని వాసు నిర్మించారు. విజయ్ సరసన కన్నడ భామ రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ ఓవరాల్ కలక్షన్స్ ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ వసూళు చేయగా కలక్షన్స్ ఇంకా స్టడీగానే ఉన్నాయి.