
బయోపిక్ సినిమాల హవా నడుస్తున్న టాలీవుడ్ లో కొత్తగా ఇప్పుడు హీరో, విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు బయోపిక్ రెడీ అవుతుంది. ఏంటి జగపతిబాబు బయోపిక్.. ఇది నిజమా అని అవాక్కవ్వొచ్చు.. కాని ఇది నిజమే. నిర్మాత వి.బి రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన జగపతి బాబు హీరోగా, విలన్ గా కెరియర్ కొనసాగిస్తున్నాడు.
కెరియర్ మొదట్లో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కున్న జగపతి బాబు ఇప్పుడు సపోర్టింగ్, విలన్ రోల్స్ తో సాటిస్ఫైడ్ కెరియర్ తో ఉన్నాడని చెప్పొచ్చు. లెజెండ్ సినిమాతో విలన్ గా కొత్త టర్న్ తీసుకున్న జగపతి బాబు సత్తా చాటాడు. ఇక జగపతి బాబు బయోపిక్ గా 20 ఎపిసోడ్స్ సీరియల్ వస్తుంది.
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ వారు ఈ క్రేజీ బయోపిక్ చేస్తున్నారు. హీరో, విలన్ తప్ప జగపతి బాబు బయోపిక్ లో ఏముంది చెప్పడానికి అంటే.. హీరోగా ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారు. అతను మిస్ చేసుకున్న సినిమాలు.. ఆయన్ను మోసం చేసిన మనుషులు ఇలా అందరి గురించి డీటైల్డ్ గా ఈ బయోపిక్ లో ఉంటుందట. ఈ బయోపిక్ కు టైటిల్ గా సముద్రం అని టైటిల్ ఫిక్స్ చేశారు.