నవాబ్ ట్రైలర్.. మణిరత్నం ఈజ్ బ్యాక్..!

సౌత్ లో క్రియేటివ్ డైరక్టర్స్ లో ఒకరైన మణిరత్నం కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఓకే కన్మణి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు. ఆ తర్వాత కార్తితో తీసిన సినిమా ఫ్లాప్ అవగా మళ్లీ చెక్క చివంత వానం సినిమాతో వస్తున్నాడు మణిరత్నం. ఈ సినిమా తెలుగులో నవాబ్ గా రిలీజ్ చేస్తున్నారు. శింభు, అరవిందం సామి, ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాలో జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితి నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూస్తే మణిరత్నం ఈజ్ బ్యాక్ అని చెప్పక తప్పదు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో మణిరత్నం మార్క్ కనిపిస్తుంది. శింభు, అరవింద సామి పాత్రలు హైలెట్ గా నిలుస్తాయని చెప్పొచ్చు. ట్రైలర్ అయితే గొప్ప అనుభూతిని ఇచ్చింది. సినిమాటోగ్రఫీ ఫస్ట్ క్లాస్ గా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.