విజయ్ రెమ్యునరేషన్ పెంచాడా..!

లేటెస్ట్ యువ సంచలనం విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల హవా కొనసాగిస్తుంది. 50 కోట్ల గ్రాస్ ఇప్పటికే దాటేసిన ఈ సినిమా చూస్తుంటే 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రాబట్టేలా కనబడుతుంది. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఇలా వరుసగా మూడు హిట్లు కొట్టేసరికి విజయ్ కు తన మీద తనకు కాన్ఫిడెన్స్ వచ్చేసిందని తెలుస్తుంది. అందుకే ఇమేజ్ క్యాష్ చేసుకునేలా రెమ్యునరేషన్ పెంచేశాడట.

కేవలం 3 సినిమాలతోనే స్టార్ ఇమేజ్ అందుకున్న విజయ్ దేవరకొండ మినిమం గ్యారెంటీ హీరో అయ్యాడు. అంతేకాదు కరెక్ట్ సినిమా పడితే అతని సినిమ కలక్షన్స్ ఎలా ఉంటాయో గీతా గోవిందం సినిమా చూస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న డియర్ కామ్రేడ్ అవగానే కొద్దిపాటి గ్యాప్ తో తన తర్వాత సినిమాలు మొదలుపెట్టబోతున్నాడట. నిన్నటిదాకా 2,3 కోట్లు ఉన్న ఈ హీరో ఇప్పుడు సినిమాకు 10 కోట్లు రెమ్యునరేషన్ అంటున్నాడట. మరి విజయ్ నిజంగానే రెమ్యునరేషన్ పెంచాడా లేక ఈ వార్తలన్ని రూమర్సా అన్నది తెలియాల్సి ఉంది.