దాసు ఏంటి సంగతి.. దేవదాస్ టీజర్..!

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నానిలు కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో సి. అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్రేజ్ తీసుకురాగా కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ఇంకాస్త అంచనాలను పెంచేసింది. ఏకంగా మందు బాటిల్ తో సిట్టింగ్ వేసి కనిపించిన దేవ.. దాసులు ఫన్ జెనరేట్ చేశారు.

నాగార్జున గ్లాసులో అలా మందు పోసి వాటర్ కోసం ఇటు తిరగ్గానే అలా గుట్టుకున ఆ మందు గ్లాసు ఖాళీ చేస్తున్నాడు నాని. సోడా.. వాటర్ ఏం కావాలి అనేలోపే మందు కాజేస్తాడు. నాని ఊపు చూసి దాసు ఏంటి సంగతి అనేస్తాడు నాగార్జున. దానికి నాని అమాకయంగా ఫేసు పెడతాడు. నిమిషం కన్నా తక్కువ ఉన్న టీజరే ఇంత ఫన్నీగా అనిపిస్తే నాగ్, నానిల దేవదాస్ సినిమా మొత్తం ఇంకెలా అలరిస్తుందో చూడాలి.

సెప్టెంబర్ 27న రిలీజ్ చేతున్న ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్, రష్మిక ఫీమేల్ లీడ్ గా చేస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మల్టీస్టారర్ మూవీలో సరికొత్త అంచనాలతో వస్తుంది.