
అక్కినేని యువ హీరో అఖిల్ హలో తర్వాత తొలిప్రేమ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. యూరప్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కూడా ప్రేమ కథగానే తెరకెక్కిస్తున్నాడట వెంకీ అట్లూరి. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ తన సినిమాని కూడా ప్లానింగ్ చేస్తున్నాడు. సినిమా సెలక్షన్స్ లో బాగా ఆలొచించే అఖిల్ ఈసారి 3వ సినిమా సెట్స్ మీద ఉండగానే తర్వాత సినిమా కన్ఫాం చేస్తున్నాడు.
అఖిల్ నాల్గవ సినిమా ఆది పినిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్ డైరక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆది పినిశెట్టి చూచాయగా చెప్పాడు. తెలుగు, హింది భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. కరణ్ జోహార్ తో పాటుగా ఈ సినిమా నిర్మాణంలో నాగార్జున కూడా భాగమవుతున్నాడట. చూస్తుంటే అఖిల్ ఈసారి పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నాడని అనిపిస్తుంది.