హిట్టు సినిమా.. ఫ్లాప్ అవకాశాలు..!

గీతా గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. గీత ఆర్ట్స్-2 బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాను పరశురాం డైరెక్ట్ చేశాడు. విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కలక్షన్స్ దూకుడు చూస్తుంటే ఈ సినిమా 70 నుండి 80 కోట్ల దాకా రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే పరశురాం తన తర్వాత సినిమా ఏంటన్నది డిస్కషన్స్ మొదలైంది. 

మంచు విష్ణుతో పరశురాం సినిమా కన్ఫాం చేయగా.. మరో పక్క గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే పరశురాం సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే పరశురాం సూపర్ హిట్ కొట్టాక ఏ స్టార్ హీరోతో సినిమా చేస్తాడని అనుకుంటే ఫ్లాప్ హీరోతో చేయాల్సి వస్తుంది. ఒకవేళ మంచు విష్ణుతోనే సినిమా చేస్తే ఈ మంచు హీరో కూడా ఫ్లాపులో ఉండగా.. గీతా ఆర్ట్స్ తో సినిమా అయితే సాయి ధరం తేజ్ కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు. మరి విష్ణు, తేజూ ఫ్లాప్ అవకాశాలు పరశురాం లెక్క ఎలా సరిచూసుకుంటాడో చూడాలి.