వైజాగ్ లో మెగా స్టూడియో..?

రెండు రాష్ట్రాలుగా విడిపోయాక అన్ని విభాగాల్లో డెవలప్ మెంట్స్ చేస్తున్న ఏపి తెలుగు సిని పరిశ్రమను కూడా హైదరాబాద్ నుండి వైజాగ్ కు తరలించాలని గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఈ క్రమంలో భాగంగా ఈమధ్యనే చిన్న సినిమాలకు ఏపి ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలు ఇచ్చింది. అంతేకాదు అక్కడ పరిశ్రమ ఏర్పాట్లకు కావాల్సిన సహకారాన్ని అందించేందుకు సై అంటుంది. 

ఇందులో భాగంగా నందమూరి బాలకృష్ణ వైజాగ్ లో ఓ ఇంటర్నేషనల్ లెవల్ లో ఫిల్మ్ స్టూడియో కట్టించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం వైజాగ్ లో ఉన్న రామానాయుడు స్టూడియో దగ్గరలోనే ఈ స్టూడియో నిర్మాణం ఉంటుందని తెలుస్తుంది. ఇక మరోపక్క కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీ ఓ స్టూడియో కట్టే ఆలోచనలో ఉన్నారు. ముందు హైదరాబాద్ లో అనుకున్న మెగా స్టూడియో ఇప్పుడు వైజాగ్ లో కట్టించాలని చూస్తున్నారట. 

ఏపి ప్రభుత్వం ఎలాగు సిని పరిశ్రమకు సపోర్ట్ గా నిలుస్తుంది కాబట్టి ఇప్పుడే స్టూడియోలకు సంబందించిన విషయాలను మాట్లాడుతున్నారట. ఒకవేళ అదే జరిగితే టాలీవుడ్ కూడా రెండు భాగాలుగా విడిపోయే ఛాన్స్ ఉంది. అప్పుడు తెలంగాణాలో ప్రతిభ గల వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు.