
టైటిల్ చూసి కాస్త షాక్ అవ్వొచ్చు.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఓకే కాని ఈ క్రేజీ స్టార్ ఎవరంటే అతనే విజయ్ దేవరకొండ. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ యువ హీరోకి ఇప్పుడున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని క్రేజీ స్టార్ అని అంటున్నారు. లేటెస్ట్ గా గీతా గోవిందం తో తన స్టార్డం ఏంటో చూపించిన విజయ్ దేవరకొండ సర్ ప్రైజ్ గా సూపర్ స్టార్ మహేష్ తో ఫోటో దిగి తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టుకున్నాడు.
మహేష్ మహర్షి సినిమా సెట్స్ లో విజయ్ కనిపించాడు. పక్కన మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నాడు. ప్రస్తుతం మహేష్, విజయ్ దిగిన ఈ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటోని షేర్ చేస్తూ సూపర్ స్టార్ విత్ క్రేజీ స్టార్ అని తెగ కామెంత్స్ చేస్తున్నారు. యూత్ లో విజయ్ ఫాలోయింగ్ చూసి స్టార్ హీరోలు సైతం అవాక్కవుతున్నారని చెప్పొచ్చు.