కోలీవుడ్ టెంపర్ మొదలైంది..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కెరియర్ లో టెంపర్ సినిమా చాలా ఇంపార్టెంట్. పూరి డైర్క్షన్ లో వచ్చిన ఆ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించాడు. ఆ సినిమా తర్వాత నుండి లాస్ట్ ఇయర్ వచ్చిన జై లవ కుశ వరకు ఎన్.టి.ఆర్ తిరుగు చూడాల్సిన పనిలేకుండా అవుతుంది. టెంపర్ ముందు దాకా ప్రేక్షకులు తనని ఎలా చూడాలని అనుకుంటున్నారో అనే చిన్న కన్ ఫ్యూజన్ ఉన్న ఎన్.టి.ఆర్ ఫైనల్ గా టెంపర్ నుండి తిరుగులేని విధంగా క్రేజ్ తెచ్చుకున్నాడు.

టాలీవుడ్ నెంబర్ 1 హీరోకు సరిపడే స్టామినా కలిగిన తారక్ అసలు దమ్ము ఏంటో చూపిస్తున్నాడు. ఇక ఎన్.టి.ఆర్ చేసిన టెంపర్ మూవీ తమిళ రీమేక్ లో విశాల్ నటిస్తున్నాడు. ఆ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. వెంకట్ మోహన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సాం సంగీతం అందిస్తున్నాడు. విశాల్ తో రాశి ఖన్నా మొదటిసారి జొడి కడుతుంది. 

ఇక ఇదే సినిమా హిందిలో రన్వీర్ సింగ్ కూడా రీమేక్ చేస్తున్నాడు. రోహిత్ శెట్టి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలొ రన్వీర్ సింగ్ నటిస్తున్నాడు. తమిళ టెంపర్ కు అయోగ్య అని టైటిల్ పెట్టారు.