దేవదాస్ టీజర్ వచ్చేస్తుంది..!

మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగిస్తున్న తెలుగు పరిశ్రమలో లేటెస్ట్ గా కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి ఓ సీమా చేస్తున్నారు. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా దేవదాస్ అని పెట్టారు. ఈ సినిమాను అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ అటు అక్కినేని, ఇటు నాచురల్ స్టార్ ఫ్యాన్స్ ను అలరించగా ఈ సినిమా టీజర్ ఆగష్టు 29న కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారట.

డాన్ గా నాగార్జున, డాక్టర్ గా నాని ఇద్దరు కలిసి చేసే అల్లరే దేవదాస్ కథాంశమని అంటున్నారు. రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లో నాగార్జున, నానిలు బెడ్ మీద పడుకుని ఉన్నట్టుగా చూపించారు. మరి ఈ టీజర్ లో ఇద్దరు ఎలా కనిపిస్తారో చూడాలి. ఈ సినిమాతో పాటుగా చరణ్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ సినిమా అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. 

ఇదేకాకుండా విక్టరీ వెంకటేష్ కూడా వరుణ్ తేజ్ తో ఎఫ్-2 సినిమా చేస్తున్నాడు. దానితో పాటుగా మేనళ్లుడు నాగ చైతన్యతో మరో మల్టీస్టారర్ సినిమా షురూ చేశాడు. మొత్తానికి టాలీవుడ్ లో ఈ మల్టీస్టారర్ ట్రెండ్ ఎన్నాళ్లు కొనసాగుతుందో ఏమో కాని మల్టీస్టారర్ సినిమాల సందడితో ప్రేక్షకులు మాత్రం ఎంజాయ్ చేస్తారు.