
ప్రేమించి పెళ్లాడిన నాగ చైతన్య, సమంతలు పెళ్లి తర్వాత సినిమాల్లో మరింత జోష్ కనబరుస్తున్నారు. అసలు తెలుగు సినిమాల్లో పెళ్లైన భామలకు డిమాండ్ తగ్గిపోద్ది కాని సమంత దానికి మినహాయింపని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత అమ్మడు చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలను అందుకున్నాయి. ఇక ఇద్దరు తమ సినిమాలతో ఇతరులకు మంచి పోటీ ఇవ్వడం కామనే కాని ఇప్పుడు చైతు, సమంత ఇద్దరు ఒకరికి ఒకరు పోటీగా మారిన పరిస్థితి కనబడుతుంది.
సమంత నటిస్తున్న యూటర్న్ సెప్టెంబర్ 13న రిలీజ్ ప్లాన్ చేశారు. ఇక అదే డేట్ కు లేటెస్ట్ గా శైలజా రెడ్డి అల్లుడు రిలీజ్ ఫిక్స్ చేశారు. ముందు ఆగష్టు 31న రిలీజ్ అనుకున్న శైలజా రెడ్డి అల్లుడు కాస్త వాయిదా పడి సెప్టెంబర్ 13న రిలీజ్ అంటున్నారు. కేరళ వరదలకు మ్యూజిక్ డైరక్టర్ గోపి సుందర్ సినిమాకు ఇవ్వాల్సిన ఆర్.ఆర్ పెండింగ్ ఉందట. అందుకే సినిమాకు మరో వారం పోస్ట్ ప్రొడక్షన్ జరగాల్సి ఉంది.
కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ సినిమా రీమేక్ గా సమంత లీడ్ రోల్ లో వస్తున్న యూటర్న్ ఓ మర్డర్ మిస్టరీతో వస్తుంది. సమంత తన కెరియర్ లో మొదటిసారి ఇలాంటి క్రేజీ రోల్ లో నటిస్తుంది. ఇద్దరి సినిమాల రిలీజ్ డేట్లు క్లాష్ అవుతున్నాయి. మరి వారిలో ఎవరు తగ్గుతారో చూడాలి.