చైతు కాదు పేపర్ బాయ్ వస్తున్నాడు..!

మారుతి డైరక్షన్ లో అక్కినేని నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అసలైతే ఆగష్టు 31న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కేరళ వరదల కారణంగా సినిమా సంగీత దర్శకుడు గోపి సుందర్ అక్కడ ప్రాంతానికి చెందిన వాడే కావడం వల్ల ఆర్.ఆర్ ఇంకా అవలేదట. 

అందుకే సినిమా సెప్టెంబర్ 13కి వాయిదా వేశారు. ఇక చైతు వదిలిన ఆగష్టు 31న సంపత్ నంది నిర్మిస్తున్న పేపర్ బాయ్ సినిమా రిలీజ్ అవుతుంది. ముందు ఈ సినిమాను సెప్టెంబర్ 7న రిలీజ్ ప్లాన్ చేయగా చైతు సినిమా వాయిదా పడుతుందని తెలిసి ఆ డేట్ కు పేపర్ బాయ్ వచ్చేస్తున్నాడు. జయశంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా లవ్ స్టోరీగా వస్తుంది. సినిమా నిర్మించడమే కాదు సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందించాడు సంపత్ నంది.