
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. టైటిల్ పోస్టర్ తోనే సంచలనంగా మారిన ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. మంగళవారం ఉదయం రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్క రోజులో 7 మిలియన్ వ్యూస్ సంపాదించగా ఇప్పటికి 1 కోటి 20 లక్షల వ్యూస్ తో ఏ తెలుగు సినిమా టీజర్ సృష్టించని అరుదైన రికార్డ్ సాధించింది.
సినిమా టీజరే ఈ రేంజ్ సంచలనాలు సృష్టిస్తే ఇక సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అని మెగా ఫ్యాన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. సినిమాలో చిరు లుక్ మెగా ఫ్యాన్స్ కే కాదు సిని ప్రియులను అలరించింది. అందుకే టీజర్ ను ఈ రేంజ్ లో హిట్ అయ్యింది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రిదేవి మ్యూజిక్ అందిస్తున్నాడు. 12 మిలియన్ వ్యూస్ తో సైరా టీజర్ సత్తా చాటగా సినిమా 2019 సమ్మర్ లో రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది.