
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికెళ్లి మరి అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన అధినేతగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రజా పోరాట యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ చిరు బర్త్ డే కోసం దానికి బ్రేక్ ఇచ్చేసి మరి అన్నయ్య ఇంటికి వెళ్లి మరి విష్ చేయడం జరిగింది. ఇక చిరు, పవన్ ఇద్దరు ఒకే ఫ్రేంలో ఉన్న పిక్ ను తన ఫేస్ బుక్ లో షేర్ చేశాడు రాం చరణ్.
గడ్డాలతో బ్రదర్స్ ఇద్దరు.. తమ ఇంట్లో నాన్న బర్త్ డే లంచ్.. అన్నదమ్ముల అనుబంధం అంటూ కామెంట్ చేస్తూ చిరు, పవన్ కలిసిన పిక్ షేర్ చేశాడు. చాలా రోజుల తర్వాత అన్నదమ్ములు ఇద్దరు కలవడం విశేషం. ఇక ఈ కలయిక మెగా ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు. మెగాస్టార్ 63వ బర్త్ డే సందర్భంగా ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి టీజర్ రిలీజ్ చేశారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సైరా సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు.