మోస్ట్ పాపులర్ స్టార్ ప్రభాస్..!

బాహుబలికి ముందు ప్రభాస్ కేవలం తెలుగు పరిశ్రమకు మాత్రమే తెలుసు.. కాని ఆఫ్టర్ బాహుబలి నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. బాహుబలి మొదటి రెండు పార్టులతో బాషతో సంబందం లేకుండా అంచనాలను పెంచేశాడు ప్రభాస్. ఇక ఇప్పుడు అతని క్రేజ్ చాటేలా మూడ్ ఆఫ్ ది నేషనల్ పోల్ 2018 లో టాప్ 5 లిస్టులో ప్లేస్ సంపాదించాడు. 

మూడ్ ఆఫ్ నేషనల్ పోల్ 2018లో భాగంగా ఇండియా టుడే వారు నిర్వహించిన పోల్ లో టాప్ 5వ స్థానంలో ప్రభాస్ స్థానం సపాదించాడు. టాప్ 1 లో సల్మాన్ ఖాన్ ఉండగా.. సెకండ్ ప్లేస్ లో అక్షయ్ కుమార్ నిలిచారు. ఇక 3వ స్థానంలో షారుఖ్, రణ్ బీర్ పంచుకోగా.. అమితాబ్ నాల్గవ స్థానం సంపాదించారు. ఐదవ స్థానంలో ప్రభాస్ రణ్ బీర్ సింగ్ లు నిలిచారు. ఈ లిస్టులో సౌత్ హీరోల నుండి ప్రభాస్ ఒక్కడే ఈ క్రేజ్ దక్కించుకున్నాడు. దీన్ని బట్టి ప్రభాస్ కు నేషనల్ వైడ్ గా ఏ రేంజ్ క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.