మహర్షి మహేష్ లుక్ లీక్..!

సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా టీజర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరిని ఆకట్టుకుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఓ లుక్ లీక్ అయ్యింది. ఈ లుక్ చూస్తే మహేష్ హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాడని చెప్పొచ్చు.

టాలీవుడ్ హ్యాండ్సం హీరో అయిన మహేష్ మహర్షి కోసం ప్రత్యేకంగా గడ్డం లుక్ తో కనిపిస్తున్నాడు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఈ లీకులు చిత్రయూనిట్ ను టెన్షన్ లో పడేస్తున్నాయి. భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ మహర్షిగా ఎలాంటి హంగామా చేస్తాడో చూడాలి.