
బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా ఆ సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక రెండో సీజన్ నాచురల్ స్టార్ నాని మీద హోస్టింగ్ బాధ్యతలు పెట్టారు. ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 పది వారాలు పూర్తి చేసుకుంది. ఇక మిగిలింది నాలుగు వారాలు మాత్రమే మొదట్లో కాస్త అటు ఇటుగా అనిపించినా ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల మొదటి ఆప్షన్ బిగ్ బాస్ అయ్యింది.
నాని హోస్ట్ గా బిగ్ బాస్ 2 ఎలాగోలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. లీకులు కాస్త హెడేక్ అనిపిస్తున్నా ఫైనల్ గా షో మాత్రం సక్సెస్ అయినట్టే. ఇది పూర్తి కాకముందే బిగ్ బాస్ 3 పై చర్చలు మొదలు పెట్టారు. ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ దేవరకొండ చేస్తాడని లేటెస్ట్ టాక్. పెళ్లిచూపులు నుండి గీతా గోవిందం వరకు వరుస హిట్లు కొడుతున్న ఈ హీరోకి యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే బిగ్ బాస్ 3కి హోస్ట్ గా మాట్లాడుతున్నారట. మరి విజయ్ అందుకు ఒప్పుకుంటాడా లేదా అన్నది చూడాలి.