
సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి చేస్తున్న ఈ సినిమా నుండి ఈమధ్య వచ్చిన టీజర్ అంచనాలు పెంచేసింది. మహేష్ కొత్త లుక్ లో సర్ ప్రైజ్ ఇస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
సినిమాలో మహేష్ తల్లి పాత్రలో అలనాటి తార జయప్రద నటిస్తుందని తెలుస్తుంది. అయితే చిత్రయూనిట్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న జయప్రద ఇన్నాళ్లకు మళ్లీ ఫేస్ కు మేకప్ వేసుకోబోతుందని తెలుస్తుంది. సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తల్లి పాత్రలో జయప్రద నటిస్తుందా లేదా అన్నది త్వరలో తెలియాల్సి ఉంది.