సుమంత్ 'ఇదం జగత్' టీజర్.. !

సుమంత్ హీరోగా అనీల్ శ్రీకంఠం డైరక్షన్ లో వస్తున్న సినిమా ఇదం జగత్. మళ్లీ రావా హిట్ తో కెరియర్ లో కొత్త ఉత్సాహం ఏర్పరచుకున్న సుమంత్ ఇదం జగత్ తో వస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఈరోజు వై.ఎస్ జగన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. టీజర్ విషయానికొస్తే.. చావు న్యూసే.. జ్ఞాపకం న్యూసే.. ప్రేమా న్యూసే.. స్నేహం న్యూసే ప్రతిది న్యూసే అంటూ టీజర్ ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు.

విరాట్ ఫిలిమ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తిక్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను జొన్నలగడ్డ పద్మావతి గంగపట్నం శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమంత్ సరసన అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేసింది. త్వరలో రిలీజ్ అవనున్న ఈ సినిమా సుమంత్ కు మరో హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటుగా సుమంత్ సుబ్రమణ్యపురం సినిమా చేస్తున్నాడు.