లావణ్య హిట్ మిస్సైంది..!

సాధారణంగా సినిమా పరిశ్రమలో ఒకరికి వచ్చిన అవకాశాన్ని మరొకరు అందుకోవడం సర్వసాధారణం. డేట్లు ఖాళీలేకనో.. స్టోరీ నచ్చకనో కొందరు హీరో, హీరోయిన్స్ సినిమాలను వదులుకుంటారు. అలా మిస్సైన సినిమాలు ఫ్లాప్ అయితే ఏమో కాని హిట్ అయితే మాత్రం మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నామనే భావన ఉంటుంది. అలాంటి పరిస్థితులు చాలానే ఉన్నాయి.. ఉంటాయి. 

లేటెస్ట్ గా గీతా గోవిందం సినిమా హీరోలు మిస్ చేసుకున్నారన్న సంగతి తెలిసిందే. నాని, శర్వానంద్, చైతు ముగ్గురు ఈ కథను రిజెక్ట్ చేశారు. ఫైనల్ గా విజయ్ దేవరకొండ చేసి సూపర్ హిట్ కొట్టాడనుకోండి. ఇక మరో పక్క హీరోయిన్ గా కూడా చాలామందినే అడిగారట. అందులో లావణ్య త్రిపాఠి కూడా ఉందట. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో అల్లు శిరీష్ చేసిన శ్రీరస్తు శుభమస్తు సినిమాలో లావణ్య హీరోయిన్ గా నటించింది. అదే బ్యానర్ అదే దర్శకుడు చేసిన గీతా గోవిందంలో ముందు ఆమెనే హీరోయిన్ గా అనుకున్నారట కాని ఆమె సారీ చెప్పేసిందట. 

విజయ్ తో చేయడం ఇష్టం లేక కాదనేసిందని టాక్. ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మికకు హిట్ పడేసరికి అమ్మడు నాలిక కొర్రుక్కుంటుంది. కెరియర్ ఏమాత్రం ఆశాజనకంగా లేని లావణ్య త్రిపాఠి గీతగా నటించే ఛాన్స్ మిస్ చేసుకుని మిస్టేక్ చేసిందని చెప్పొచ్చు.