
మెగాస్టా చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ లో నరసింహారెడ్డి లుక్ లో మెగాస్టార్ అదరగొట్టేశారు.
మెగాస్టార్ మెరుపులతో టీజర్ హైలెట్ అయ్యింది. ఇక సినిమా బడ్జెట్ రేంజ్ కు తగినట్టుగా సెట్స్ వేసినట్టు తెలుస్తుంది. అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి కానుకగా ఓ రోజు ముందే సైరా టీజర్ వచ్చింది. రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సైరా నరసింహారెడ్డితో మెగాస్టార్ మరో సంచలనానికి సిద్ధమయ్యాడని మాత్రం చెప్పొచ్చు.