
నా పేరు సూర్య తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసే సినిమాపై ఎలాంటి కారిటీ రాలేదు. విక్రం కుమార్ తో సినిమా ఉంటుందని తెలుస్తున్నా అఫిషియల్ గా మాత్రం ఇంకా చెప్పలేదు. అయితే నిన్న జరిగిన గీతా గోవిందం సక్సెస్ మీట్ లో విక్రం కుమార్ కూడా కనిపించాడు. వేడుకలో భాగంగా మాట్లాడిన విక్రం సినిమా దర్శకుడు పరశురాం, హీరో విజయ్, సినిమా నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపాడు.
గీతా ఫంక్షన్ కు విక్రం రావడం సినిమా చేస్తున్నాడు కాబట్టే అని ఫిక్స్ అవుతున్నారు. బన్ని కోసం ఓ క్రేజీ స్టోరీ రాసుకున్నాడట విక్రం కుమార్. ఇష్క్, మనం, 24 సినిమాలతో తన సత్తా చాటిన విక్రం కుమార్ అఖిల్ హలోతో అంతగా ఆకట్టుకోలేదు కాని బన్ని సినిమాతో మాత్రం కచ్చితంగా కమర్షియల్ గా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తాడని తెలుస్తుంది.