
అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుశాంత్ సినిమాలైతే తీస్తున్నాడు కాని అతనికి ప్రేక్షకుల ఆదరణ మాత్రం కరువయ్యింది. అతని కెరియర్ లో మొదటిసారి రిలీజ్ కు ముందే సినిమాపై ఓ పాజిటివ్ బజ్ రావడం చిలసౌ సినిమాకే జరిగింది. రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా హిట్ అయ్యింది. మొదటి షో నుండి టాక్ బాగున్నా కలక్షన్స్ మాత్రం అంతంత మాత్రమే అని చెప్పాలి.
ఎలాగైతేనేం సుశాంత్ కు ఓ మంచి బూస్ట్ ఇచ్చిన సినిమాగా చిలసౌ సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత రాహుల్ రవింద్రన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. రీసెంట్ గా నాగార్జున మన్మధుడు-2 టైటిల్ అన్నపూర్ణ బ్యానర్ లో రిజిస్టర్ చేయించాడని తెలిసిందే. అది రాహుల్ రవింద్రన్ కోసమే అంటున్నారు. మన్మధుడు-2 చైతు, అఖిల్ కోసం కాదట. నాగార్జుననే ఈ సినిమా చేస్తాడని అంటున్నారు. చిలసౌతో ప్రతిభ చాటిన రాహుల్ రవింద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారట. ఈ వార్త నిజమే అయితే హీరోగా సక్సెస్ అవని రాహుల్ రవింద్రన్ డైరక్టర్ గా సూపర్ సక్సెస్ అయినట్టే లెక్క.