
సంపత్ నంది ప్రొడక్షన్స్ లో సంపత్ నంది కథ అందించిన సినిమా పేపర్ బోయ్. జయశంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. పేపర్ బోయ్ ఓ పెద్దింటి అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది.. వారి ప్రేమని గెలిపించడం కోసం ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయి అన్నది పేపర్ బోయ్ కథ. ట్రైలర్ చూస్తే సినిమా ఫీల్ గుడ్ మూవీగా అనిపిస్తుంది.
ఈ సినిమాలో సంతోష్ శోభన్, రియా సుమన్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచగా సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు చిత్రయూనిట్. చిత్ర నిర్మాత సంపత్ నంది ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడుతూ నిజాయితీగా రాసుకున్న కథ ఇదని అన్నారు. ఇదవరకు గాలిపటం నిర్మించిన సంపత్ నంది ఈ పేపర్ బోయ్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.