మనసులు గెలిచిన కీర్తి సురేష్..!

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా ప్రతిభ చాటుతున్న కీర్తి సురేష్ మళయాల పరిశ్రమ నుండి వచ్చి ఇక్కడ స్టార్డం సంపాదించింది. ఇక మహానటి తర్వాత ఆమె రేంజ్ ఏంటో తెలిసిందే. అభినయతారగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన కీర్తి సురేష్ ప్రతి సినిమాకు ఓ మంచి అలవాటుని కొనసాగిస్తుంది. సినిమాకు ఏదో పనిచేశాం వెళ్లాం అన్నట్టు కాకుండా సినిమాకు పనిచేసిన యూనిట్ అందరికి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇస్తుందట కీర్తి సురేష్.

సండై కోళి సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ ఆ సినిమా యూనిట్ కు గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చిందట. ఇది మొదటిసారి కాదు మహానటి సినిమాకు కూడా కీర్తి సురేష్ ఇలానే చేసిందట. తనలోని మంచి తనంతో అందరి మనసులు గెలుచుకుంటున్న కీర్తి రానున్న రోజుల్లో సౌత్ స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం తమిళంలో విజయ్, విశాల్ సినిమాల్లో నటిస్తుంది కీర్తి సురేష్.