
అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా మొదటి సినిమాతోనే తన ప్రతిభ చాటిన సందీప్ వంగ సెకండ్ మూవీ ఎవరితో చేస్తాడన్న ఎక్సైటింగ్ మొదలైంది. అయితే అర్జున్ రెడ్డి హింది రీమేక్ డైరక్షన్ లో బిజీగా ఉన్న సందీప్ వంగ తెలుగులో సెకండ్ మూవీని సూపర్ స్టార్ మహేష్ తో చేస్తాడని తెలుస్తుంది. ఈ కాంబినేషన్ గురించి కొన్నాళ్లుగా డిస్కషన్స్ జరుగుతున్నా ఫైనల్ గా అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారట.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మెగా హీరోలు తప్ప మిగతా స్టార్ హీరోల సినిమాలు ప్రొడ్యూస్ చేసింది లేదు. అలాంటిది మెగా నిర్మాత అల్లు అరవింద్ మొదటిసారి సూపర్ స్టార్ మహేష్ సినిమా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం మహేష్ 25వ సినిమా మహర్షి చేస్తుండగా 26వ సినిమా సుకుమార్ తో ఫిక్స్ అయ్యాడు. సో మహేష్ 27వ సినిమా సందీప్ వంగ డైరక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. వచ్చే ఏడాది మొదలయ్యే ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతుంది.