
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేటు పలుకుతుంది. ఓవర్సీస్ లేకుండానే 80 కోట్ల దాకా తెలుగు రెండు రాష్ట్రాల్లో బిజినెస్ చేసిన ఎన్.టి.ఆర్ మూవీ శాటిలైట్ రైట్స్ లో కూడా దుమ్మురేపుతుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం జీ తెలుగు అరవింద సమేత సినిమాను అత్యధికంగా 23.5 కోట్లకు కొనేశారట.
ఎన్.టి.ఆర్ కెరియర్ లోనే కాదు మిగతా స్టార్స్ కన్నా ఎన్.టి.ఆర్ సంచలన రికార్డ్ కొట్టాడని చెప్పొచ్చు. ఏరియాల వారిగా కూడా ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమా రికార్డ్ ప్రైజ్ లో బిజినెస్ చేస్తుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.