
అదేంటి మొన్ననేగా భరత్ అనే నేను సినిమా వచ్చింది. మళ్లీ ఇంతలోనే కొరటాల శివ, మహేష్ కలిసి మరో సినిమా చేయబోతున్నారా అంటే అవును వారిద్దరు కలిసి చేస్తున్నారు కాని చేసేది సినిమా కాదు యాడ్. మహేష్ స్టార్ క్రేజ్ వాడుకునేందుకు వాణిజ్య సంస్థలు ఎప్పుడూ రెడీగా ఉంటాయి. వాటిలో మహేష్ అబి బస్ యాడ్ కొన్నాళ్లుగా చేస్తూ వచ్చాడు.
ఇన్నాళ్లు కృష్ణుడుతో కలిసి మహేష్ ఈ యాడ్ చేయగా తాజాగా వెన్నెల కిశోర్ ఈ యాడ్ లో జాయిన్ అయ్యాడు. ఇంతకుముందు ఆ యాడ్ ఎవరు చేశారో తెలియదు కాని ఇప్పుడు అబి బస్ యాడ్ మాత్రం కొరటాల శివ డైరెక్ట్ చేశాడని తెలుస్తుంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల తర్వాత ఈ ఇద్దరు కలిసి సినిమా చేయడం అన్నది తెలియదు కాని యాడ్ మాత్రం అదరగొట్టేశారు. ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ నెల 9న మహేష్ బర్త్ డే నాడు ఆ సినిమా ఫస్ట్ లుక్ రాబోతుందని తెలుస్తుంది.