దేవదాస్ ఫస్ట్ లుక్.. నాగ్, నాని సూపరెహే..!

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. నాగార్జున డాన్ పాత్రలో కనిపిస్తుండగా.. నాని డాక్టర్ గా నటిస్తున్నాడు. సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. ఇద్దరు స్నేహితులు వారిలో ఒకరు డాన్, మరొకరు డాక్టర్ వీరి మధ్య జరిగే కథే దేవదాస్ సినిమా.

సినిమా ఫస్ట్ లుక్ అంచనాలను పెంచేసింది. ఆకాంక్ష సింగ్, రష్మిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫస్ట్ లుక్ మాత్రం ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ను అలరించింది. ప్రత్యేకంగా నాగార్జున ఒక చేతిలో గన్ మరో చేతిలో వైన్ బాటిల్ ఉండటం అక్కినేని ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుంది. సెప్టెంబర్ 27న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.