భరత్ భామకు కోలీవుడ్ ఛాన్స్..!

బాలీవుడ్ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియరా అద్వాని తెలుగులో సూపర్ స్టార్ మహేష్ సరసన భరత్ అనే నేను సినిమాలో నటించింది. ఆ సినిమా సక్సెస్ అవడమే కాకుండా అమ్మడి నటన చూసి భరత్ అనే నేను నిర్మాత దానయ్య తన తర్వాత సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చాడు. తెలుగులో నటిస్తూనే బాలీవుడ్ లో లస్ స్టోరీస్ వెబ్ సీరీస్ చేసి కుర్రాళ్ల మతులు పొగొట్టింది కియరా అద్వాని.

ఇక లేటెస్ట్ గా అమ్మడికి కోలీవుడ్ నుండి క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. తమిళ స్టార్ హీరో విజయ్ కు జోడీగా కియరా అద్వాని నటిస్తుందట. ప్రస్తుతం విజయ్ మురుగదాస్ సర్కార్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత అట్లీ డైరక్షన్ లో ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా కియరా ఫైనల్ అయ్యిందట. తెరి, మెర్సల్ సినిమాల తర్వాత అట్లీ, విజయ్ కలిసి చేస్తున్న సినిమా ఇది. 

కాంబినేషన్ చూస్తేనే ఇది మరో బ్లాక్ బస్టర్ మూవీ అని తెలుస్తుంది. టాలీవుడ్ లో లానే కోలీవుడ్ లో కూడా కియరా అద్వానికి గ్రాండ్ ఎంట్రీ జరుగబోతుంది. మరి అక్కడ అమ్మడు ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.