మహేష్ టైటిల్ హింట్.. సూపర్ సస్పెన్స్..!

భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న వంశీ పైడిపల్లి మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముగ్గురు బడా నిర్మాతలు దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా మహేష్ కెరియర్ లో చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. మహేష్ 25వ సినిమాగా వస్తున్న ఈ మూవీ టైటిల్ ఆగష్టు 9న సూపర్ స్టార్ బర్త్ డే రోజు రివీల్ చేస్తారట. సినిమాలో మహేష్ ఫస్ట్ లుక్ కూడా ఆరోజే వస్తుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా టైటిల్ పై ఆసక్తి కలిగించేలా వంశీ పైడిపల్లి హింట్లు ఇస్తున్నాడు. ఇప్పటివరకు ఆర్, ఐ, ఎస్, హెచ్ లను మహేష్ సినిమా కెరియర్ ను ఉద్దేశించి రాస్తూ వచ్చారు. అయితే ఫైనల్ గా ఇక రావాల్సింది ఒక్క లెటర్ మాత్రమే. అది కూడా ఐ. ఎందుకంటే మహేష్ 25వ సినిమా టైటిల్ రిషిని ప్రచారంలో ఉంది. సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.