24 కిస్సెస్.. ముద్దుల జాతర..!

కుమార్ 21ఎఫ్ సినిమాతో సూపర్ పాపులర్ అయిన హెబ్భా పటేల్ ఆ సినిమా ఇమేజ్ తో వరుస అవకాశాలను అందుకుంది. ప్రతి సినిమాలో అమ్మడు తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తుండగా లేటెస్ట్ గా హెబ్భా కుమారిని మించే సినిమాతో రాబోతుంది. అదే 24 కిస్సెస్ మూవీ. అయోధ్యా కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఆదిత్, హెబ్భా పటేల్ జంటగా నటిస్తున్నారు. 

కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ మొత్తం ముద్దుల ఉత్సవం జరిపారని చెప్పొచ్చు. టైటిల్ లోనే 24 కిస్సెస్ అని పెట్టారంటే మరి ఆ ముద్దుల జాతర ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. 24 కిస్సెస్ తప్పకుండా యూత్ టార్గెట్ తో వస్తున్న సినిమా అని తెలుస్తుంది. 24 అదరచుంభనాలంటే ఇక ఆ సినిమా చూసేందుకు యువత ఎగబడటం ఖాయం. టీజర్ అయితే ఇంప్రెసివ్ గానే ఉంది. మరిసారి కుమారి మార్క్ సినిమాతో వస్తున్న హెబ్భా పటేల్ సినిమాతో ఏ రేంజ్ ఫాంలోకి వస్తుందో చూడాలి.