
సింహా, లెజెండ్ సినిమాల తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో కొన్నాళ్లుగా సినిమా చర్చలు నడుస్తున్నా అవి కార్యరూపం దాల్చలేదు. ఫైనల్ గా బాలకృష్ణ తన తర్వాత సినిమా బోయపాటి శ్రీనుతో కన్ఫాం చేశాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా పూర్తి కాగానే బోయపాటి శ్రీను సినిమా లైన్ లో పెడతారట. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది.
బోయపాటి సినిమాలు 40, 50 కోట్లతో తీస్తేనే భారీగా ఉంటాయి. కాని ఈసారి బాలయ్య కోసం 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇది కచ్చితంగా సంచలనం సృష్టించే సినిమానే అని ఫిక్స్ అయ్యారు నందమూరి ఫ్యాన్స్. మొన్నామధ్య వినాయక్ తో బాలయ్య సినిమా అనుకున్నా అది ఎందుకో క్యాన్సిల్ అయ్యింది. మరి బోయపాటి, బాలయ్య 100 కోట్ల మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.